vijay devarakonda: గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో విజయ్ దేవరకొండ .. టైటిల్ ఖరారు

  • విజయ్ దేవరకొండ హీరోగా 'గీత గోవిందం'
  • కథానాయికగా రష్మిక మందన
  • సంగీత దర్శకుడిగా గోపీసుందర్  
కొంతకాలం క్రితం గీతా ఆర్ట్స్ బ్యానర్లో దర్శకుడు పరశురామ్ చేసిన 'శ్రీరస్తు శుభమస్తు' విజయాన్ని అందుకుంది. 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్లో మరో సినిమాను చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా .. రష్మిక మందన కథానాయికగా ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాకి 'గీత గోవిందం' అనే టైటిల్ ను పరిశీలించారు. ఈ టైటిల్ కి మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో .. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రేపు ప్రీ లుక్ ను .. ఆ తరువాత ఫస్టులుక్ ను వదలనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మిస్తోన్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. విభిన్నమైన కథా కథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ న్యూ లుక్ తో కనిపించనున్నాడని చెబుతున్నారు.   
vijay devarakonda
rashmika

More Telugu News