పట్టపగలు బ్యాంకు దోపిడీ.. రూ.44 లక్షలు దోచేసిన దొంగలు
- ఒడిశాలోని రూర్కెలాలో ఘటన
- బ్యాంకు సిబ్బందిని గదిలో వేసి బంధించిన దొంగలు
- లాకర్లు పగలగొట్టి దోపిడీ
అనంతరం లాకర్లను పగలగొట్టి అందులో ఉన్న రూ.44 లక్షలు దోచుకున్నారు. వెళ్తూవెళ్తూ సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. హార్డ్ డిస్క్‌లను తీసుకుని పరారయ్యారు. మార్గమధ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కచేరి శాఖకు చెందిన ఇద్దరు సిబ్బందిని అడ్డగించి బెదిరించి వారి వద్ద ఉన్న రూ.4 లక్షలు తీసుకుని ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్యాంకుకు చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేసి సోదాలు చేస్తున్నారు.