vedio game: వీడియోగేమ్ కూడా జూదం లాంటి వ్యసనమే: ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • నిద్ర, తిండిని కూడా పట్టించుకోరు
  • తీవ్ర రూపం దాలిస్తే అన్నింటినీ మర్చిపోతారు
  • ఆధారాలను పరిశీలించిన అనంతరం వ్యసనంగా నిర్ధారిస్తున్నట్టు ప్రకటన

వీడియోగేమ్ ఆడే అలవాటున్న వారిని ఆందోళనకు గురి చేసే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీడియోగేమ్ కూడా కొకైన్, జూదంలాంటి వ్యసనమేనని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను సంప్రదించిన మీదట, ఆధారాలను కూలంకషంగా పరిశీలించిన అనంతరం ఈ పరిస్థితిని వ్యసనంగా నిర్ధారించినట్టు తెలిపింది.

ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో వీడియో గేమ్ ఆడటాన్ని వ్యసనంతో కూడిన ప్రవర్తనగా వర్గీకరించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. నియంత్రణ కోల్పోవడం, ఆడకుండా ఉండలేకపోవడం, అన్నీ వదిలేసి వీడియో గేమ్ పైనే దృష్టి పెట్టడం లక్షణాలుగా వివరించింది. ఎక్కువ సేపు గేమింగ్ ఆడే వారు ఇతర ఆసక్తులు, కార్యకలాపాలను నిర్లక్ష్యం చేస్తారని, నిద్ర, తిండి కూడా పట్టించుకోరని ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్య విభాగం డైరెక్టర్ శేఖర్ సక్సేనా తెలిపారు. మరీ తీవ్ర రూపం దాల్చిన కేసుల్లో గేమింగ్ అలవాటున్న వారు స్క్రీన్ ను ఆఫ్ చేయలేరని, వీరు స్కూళ్లకు వెళ్లకపోవడం, ఉద్యోగాలను కోల్పోవడం, కుటుంబం, ఇతరులతో సంబంధాలు కోల్పోవడం జరుగుతుందన్నారు.

More Telugu News