Gujarath: భార్యకు గడ్డం పెరుగుతోందని విడాకులు కోరిన భర్త... కేసు కొట్టేసిన గుజరాత్ కోర్టు!

  • గొంతు కూడా మగవారిలా ఉంది
  • పెళ్లి చూపుల్లో పరదా కట్టారని వ్యక్తి పిటిషన్
  • విడాకులు మంజూరు చేయలేమని కోర్టు స్పష్టీకరణ
తన భార్యకు గడ్డం పెరుగుతోందని, గొంతు కూడా మగవారి మాదిరిగా ఉందని, పెళ్లి చూపుల్లో పరదా కట్టి కూర్చోబెట్టి చూడనివ్వలేదని ఆరోపిస్తూ, వివాహమైన తరువాత విడాకులకు దాఖలైన ఓ పిటిషన్ ను అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది. పెళ్లి చూపుల వేళ పరదా తీయాలని తాను కోరితే, అది సంప్రదాయం కాదని భార్య తరఫు బంధువులు చెప్పారని, పెళ్లిలోనూ ఆమెను తాను చూడలేదని, భార్య కుటుంబీకులు తనను మోసం చేశారని పిటిషన్ లో ఆరోపించాడో వ్యక్తి.

 దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, పిటిషన్ దారు భార్యను విచారించింది. తన శరీరంలో హార్మోన్ల అసమతుల్యం మాట వాస్తవమని, కానీ అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చని ఆమె తెలిపింది. తనపై భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆమె న్యాయమూర్తికి చెప్పగా, విడాకులు మంజూరు చేయలేమంటూ పిటిషన్ ను కొట్టివేశారు.
Gujarath
Ahmadabad
Court
Divorce

More Telugu News