Karnataka: సూసైడ్ చేసుకున్న ఫేస్ బుక్ ప్రియుడు... పరారైన ప్రియురాలి కోసం పోలీసుల వేట!

  • కర్ణాటకలోని గౌరిబిదనూరులో ఘటన
  • డిగ్రీ చదువుతున్న విద్యార్థినిని ప్రేమించిన రంజిత్
  • మోసం చేసిందన్న మనస్తాపంతో ఆత్మహత్య
ఫేస్ బుక్ కేంద్రంగా తాను సాగించిన ప్రేమ విఫలమైందన్న కారణంతో ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రస్తుతం పరారీలో ఉన్న అతని ప్రియురాలు, ఆమె సోదరుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటకలోని గౌరిబిదనూరు సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి నెహ్రూనగర్ లో రంజిత్ కుమార్ (24) అనే యువకుడు, హిందూపురం తాలూకా మేళాపురానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని (20) ఫేస్ బుక్ పరిచయంతో ప్రేమించాడు. ఆపై తన సోదరుడితో కలసి ఆ విద్యార్థిని రంజిత్ కుమార్ ను మోసం చేసింది. ఎంతో ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో బాధపడిన రంజిత్, తన సెల్ ఫోన్ లో మరణ వాంగ్మూలం ఇస్తూ, వీడియో తీసి, దాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేసి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, యువతి, ఆమె సోదరుడి కోసం గాలింపు ప్రారంభించారు.
Karnataka
Facebook
Sucide
Love Affair

More Telugu News