KPCL: కృష్ణపట్నం పోర్టులో అందుబాటులోకి కంటెయినర్ స్కానర్ టెక్నాలజీ

  • పోర్టులో స్కానింగ్ ఇక ఈజీ
  • గణనీయంగా తగ్గనున్న సమయం
  • పెరగనున్న కంటెయినర్ల ఎగుమతి సామర్థ్యం

కృష్ణపట్నం పోర్టులో కంటెయినర్ స్కానర్ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీతో స్కానింగ్ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పోర్టులో ‘ర్యాపిస్కాన్ ఈగల్ పీ60’ (‘ఈగల్ పీ60')ని అందుబాటులోకి తెచ్చినట్టు కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్(కేపీసీఎల్) పేర్కొంది. దీనివల్ల కంటెయినర్ స్కానింగ్ సమయం తగ్గడంతోపాటు పోర్టు భద్రత కూడా పెరుగుతుందని తెలిపింది. అంతేకాక, కంటెయినర్ల ఎగుమతి సామర్థ్యం నెలకు 5 వేల ట్వంటీ ఫూట్ ఈక్వెలెంట్ యూనిట్ (టీఈయూ)కి పెరుగుతుందని వివరించింది. ఈ సరికొత్త సాంకేతికత వల్ల కార్గో ట్రాన్షిప్‌మెంట్ కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.  

దీంతో, కంటెయినర్ స్కానర్ కలిగిన దేశంలోని ఒకే ఒక్క పోర్టుగా కేపీసీఎల్ రికార్డులకెక్కింది. సరికొత్త సాంకేతికతతో కూడిన ఈ స్కానర్‌ను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాన్ జోసెఫ్ ప్రారంభించారు. జీఎస్టీ చీఫ్ కమిషనర్ వైఎస్ శరావత్ (విశాఖపట్టణం జోన్), కృష్ణపట్నం పోర్టు సీఈవో అనిల్ యెండ్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More Telugu News