Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గౌతమ్ మీనన్ సినిమాలో తమన్నా 
  • సైరా కోసం ఏడెకరాల్లో భారీ సెట్ 
  • క్రికెటర్ పాత్రలో నాగ చైతన్య 
  • అనారోగ్యం వార్తలను ఖండించిన రానా

*  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా నటించనుంది. సూర్య హీరోగా గౌతమ్ మీనన్ రూపొందించే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రం కోసం హైదరాబాదు శివారు కోకాపేట్ లో ఏడెకరాల స్థలంలో భారీ సెట్ ను వేశారు. ప్రస్తుతం ఈ సెట్లోనే దర్శకుడు సురేందర్ రెడ్డి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు.
*  అక్కినేని నాగచైతన్య త్వరలో క్రికెటర్ పాత్రను పోషించనున్నాడు. 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో చైతూ ఇలా క్రికెటర్ గా కనిపిస్తాడు. క్రికెట్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.
*  తాను కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని హీరో రానా దగ్గుబాటి ఖండించాడు. 'నేను కంటికి ఆపరేషన్ చేయించుకోవాలి. అయితే నాకు హైబీపీ సమస్య వుండడం వల్ల ఈ సర్జరీ ఆలస్యమవుతూ వస్తోంది. ఇంతకు మించి కిడ్నీ సమస్యలేమీ లేవు' అని స్పష్టం చేశాడు. 

More Telugu News