Chanda kochhar: అనుకున్నదే అయింది.. చందా కొచ్చర్ అవుట్.. ఐసీఐసీఐ హెడ్‌గా బక్షి

  • వీడియోకాన్‌కు రుణం విషయంలో అభియోగాలు
  • సందీప్ బక్షిని పూర్తిస్థాయి సీవోవోగా నియమిస్తూ ఆదేశాలు
  • దీర్ఘకాలిక సెలవులో చందా కొచ్చర్
ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచ్చర్‌ విషయంలో అందరూ ఊహించిందే జరిగింది. ఆమె భవితవ్యాన్ని తేల్చేందుకు సోమవారం సాయంత్రం భేటీ అయిన బ్యాంకు బోర్డు.. పదవి నుంచి ఆమెను తొలగించింది. కొచ్చర్ స్థానంలో సందీప్ బక్షిని నియమించింది. ఆయన పూర్తి స్థాయి డైరెక్టర్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో)గా పనిచేస్తారని బోర్డు స్పష్టం చేసింది.

సందీప్ బక్షి ప్రస్తుతం ఐసీఐసీఐ జీవిత బీమా విభాగానికి హెడ్‌గా పనిచేస్తున్నారు. కొత్త పదవిలో ఐదేళ్లపాటు ఉండనున్నారు. నేటి నుంచే ఆయన నియామకం అమల్లోకి రానుంది. మరోవైపు, వీడియోకాన్‌కు రుణం ఇవ్వడం ద్వారా తన భర్తకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న చందా కొచ్చర్ ఐసీఐసీఐ-వీడియోకాన్ దర్యాప్తు పూర్తయ్యే వరకు దీర్ఘకాలిక సెలవులో వుంటారు.
Chanda kochhar
ICICI
Videocon
sandeep bakshi

More Telugu News