bv raghavulu: నీతి ఆయోగ్ సమావేశంలో మోదీ చేసిన సూచన చాలా ప్రమాదకరం: బీవీ రాఘవులు

  • జమిలీ ఎన్నికలు ప్రమాదకరం
  • థర్డ్ ఫ్రంట్ కోసం తాము ప్రయత్నించడం లేదు
  • ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఇప్పటికైనా డిమాండ్ చేయడం సంతోషకరం

ఢిల్లీలో నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో జమిలీ ఎన్నికల గురించి ప్రధాని మోదీ చేసిన సూచన చాలా ప్రమాదకరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరగాలన్నది నిర్ణయించాల్సింది ప్రజలేనని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ కోసం సీపీఎం ప్రయత్నించడం లేదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ విధానాలను దెబ్బతీసే విధంగా బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు.

నీతి ఆయోగ్ స్వతంత్ర ప్రతిపత్తి లేని సంస్థగా మారిపోయిందని రాఘవులు దుయ్యబట్టారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారశైలి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ఏపీకి రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. గతంలో తాము అడిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దన్నారని... ప్రత్యేక ప్యాకేజీనే కావాలని చెప్పారని... ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ కోసం ఆయన డిమాండ్ చేయడం సంతోషమని చెప్పారు. 

More Telugu News