mothk palli: మనస్సాక్షి లేని మరమనిషి చంద్రబాబునాయుడు: మోత్కుపల్లి విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై టీ-టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి మరోసారి విరుచుకుపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మనస్సాక్షి లేని మరమనిషి చంద్రబాబునాయుడు. చంద్రబాబునాయుడికి గుణపాఠం చెప్పమని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్, పవన్, సీపీఐ, సీపీఎం లను గెలిపించండి.. చంద్రబాబును పారద్రోలండి. ఇప్పటి జనరేషన్ కు ఎన్టీఆర్ పై ఏమాత్రం అభిమానం ఉన్నా.. చంద్రబాబును ఓడించి.. ఆ జెండాను నందమూరి వారికి అప్పజెప్పితే ఆ జెండా మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. లేకపోతే, ఇంతటితో క్లోజ్.

తెలంగాణలో టీడీపీ ఎలాగూ లేదు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే ప్రసక్తే లేదు. ఓటుకు ఐదు వేలు కాదు పదివేల రూపాయలు ఇచ్చినా టీడీపీని ప్రజలు గెలిపించరు. ఏపీలో ‘నిరుద్యోగభృతి’ట.. నాలుగేళ్ల నుంచి ఎందుకివ్వలేదు మెునగాడు? వెయ్యి రూపాయలిస్తాడట.. ఏం సరిపోతాయ్ వెయ్యిరూపాయలు? ఐదు వేలు ఇయి.. పేదోళ్లు నిన్ను అడుక్కోవాలా?

ఇదంతా మోసం.. టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్లకు నిరుద్యోగభృతి ఇవ్వరట. కేవలం డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకే ఇస్తారట. మరి, టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్లు గాడిదలు కాయాలా? ..ప్రజలందరూ కూడా చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నా. ఈసారి చంద్రబాబు గెలిచే ప్రశ్నేలేదు. ఈయన అవసరం మాకు లేదని ప్రజలే అనుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలను ద్రోహం చేసేటటువంటి ద్రోహి.. మానసికంగా దళిత వ్యతిరేకి చంద్రబాబునాయుడు’ అని విమర్శించారు.
Go Back to Shorts
mothk palli
Chandrababu

More Telugu News