ICICI: చంద కొచ్చర్ కు ఉద్వాసన... ఐసీఐసీఐ కొత్త సీఈఓగా సందీప్ బక్షి?

  • నేడు బ్యాంకు బోర్డు డైరెక్టర్ల సమావేశం
  • కీలక నిర్ణయాలు తీసుకోనున్న డైరెక్టర్లు
  • మేనేజ్ మెంట్ పునర్వ్యవస్థీకరణ ప్రధాన అజెండా

వీడియోకాన్ కు ఇచ్చిన భారీ రుణం తరువాత, ఆ సంస్థ యాజమాన్యం ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చంద కొచ్చర్ భర్తకు లాభం కలిగించిందన్న ఆరోపణలపై, ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్న చంద కొచ్చర్ కు బ్యాంకు బోర్డు షాక్ ఇవ్వనుందని సమాచారం. ఆమె భవితవ్యంపై నేడు చర్చించనున్న బోర్డు సీఎండీగా ఆమెను తొలగించి, పూర్తి స్థాయి నియామకం జరిగేంత వరకూ చీఫ్ గా సందీప్ బక్షిని నియమించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

 బ్యాంకు మేనేజ్ మెంట్ ను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్న బోర్డు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నేడు చర్చించనుంది. ప్రస్తుతం ఐసీఐసీఐ నిర్వహిస్తున్న బీమా అనుబంధ వెంచర్ కు సీఈఓగా సందీప్ బక్షి పని చేస్తున్నారు. 1986లో బ్యాంకులో చేరిన ఆయన్ను 2010లో ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ కు సీఈఓగా నియమించారు. అంతకుముందు బ్యాంకు మరో అనుబంధ విభాగానికి డిప్యూటీ ఎండీగానూ పనిచేశారు. చంద కొచ్చర్ కు ఉద్వాసన, సందీప్ బక్షి నియామకంపై నేటి సాయంత్రంలోగా మరింత స్పష్టత వస్తుందని సమాచారం.

More Telugu News