sai dharam tej: మేనమామ చిరంజీవి పోలికలు రావడం నా అదృష్టం: సాయిధరమ్ తేజ్

  • చిరంజీవిలానే నటిస్తున్నానని చెబుతుంటారు
  • ఎంతో సంతోషం కలుగుతుంటుంది
  • నేను నా సొంత స్టైల్ లోనే నటిస్తున్నాను
తన మేనమామ చిరంజీవి పోలికలు తనకు రావడం ఎంతో అదృష్టమని యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ అన్నాడు. చిరంజీవిలానే నటిస్తున్నావంటూ అభిమానులు చెబుతుంటారని... అప్పుడు తనకు ఎంతో సంతోషం కలుగుతుందని చెప్పాడు. కానీ, తాను చిరంజీవిని అనుకరించడం లేదని... తన సొంత స్టైల్ లోనే నటిస్తున్నానని తెలిపాడు. 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా ఆడియో విజయోత్సవ సభ సందర్భంగా మాట్లాడుతూ సాయిధరమ్ తేజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో సాయిధరమ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహిస్తుండగా... కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
sai dharam tej
tej i love you
Chiranjeevi
anupama parameshwaran

More Telugu News