modi: మోదీని పట్టించుకోకుండా వెళ్లిపోయిన చంద్రబాబు!

  • మోదీని పలకరించకుండానే వెళ్లి సీట్లో కూర్చున్న చంద్రబాబు
  • టీ బ్రేక్ లో మోదీనే వచ్చి పలకరించిన వైనం
  • నీతి ఆయోగ్ సమావేశంలో చోటు చేసుకున్న సన్నివేశం
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ తీరును, 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండగట్టారు. అంతకు ముందు సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ తన సీటులో కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు మోదీని పట్టించుకోకుండానే వెళ్లి, తన సీటులో ఆసీనులయ్యారు. ఎలాంటి పలకరింపులు చోటు చేసుకోలేదు. అనంతరం టీ బ్రేక్ సమయంలో నలుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామిలు మాట్లాడుకుంటుండగా... మోదీనే వారి వద్దకు వచ్చి, పలకరించారు.
modi
Chandrababu
niti ayog
meeting

More Telugu News