Andhra Pradesh: చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ సోదరుడి కన్నుమూత!

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణస్వామి
  • బెంగళూరులోని మాల్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • సంతాపం తెలిపిన పలువురు టీడీపీ నేతలు
చిత్తూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మహిళా నేత డీఏ సత్యప్రభ సోదరుడు కేఎం సత్యనారాయణస్వామి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన, శనివారం రాత్రి మరణించారు. బెంగళూరులోని మాల్యా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సత్యనారాయణ మరణించగా, ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

విషయం తెలుసుకున్న కర్ణాటక మాజీ సీఎం వీరప్పమొయిలీ నారాయణస్వామి మృతదేహానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, జడ్పీ చైర్ పర్సన్ గీర్వాణి, మేయర్ కఠారి హేమలత, ఎమ్మెల్సీ దొరబాబు తదితరులతో పాటు పలువురు టీడీపీ నేతలు సత్యప్రభను పరామర్శించారు.
Andhra Pradesh
Chittoor District
DK Satyaprabha
KM Narayanaswamy

More Telugu News