Casting Couch: ఇక్కడ అవకాశాలు రాకుంటే... 'షో' అంటూ అమెరికా చెక్కేస్తారు: శ్రీరెడ్డి

  • క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న శ్రీరెడ్డి
  • అమెరికాకు వెళ్లే వారి పాప్యులారిటీని బట్టి డబ్బులు
  • కాసేపు గడిపితే 1000 డాలర్లకుపైగానే ముడుతుందన్న శ్రీరెడ్డి
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం ప్రారంభించి వార్తల్లోకి ఎక్కిన నటి శ్రీరెడ్డి, అమెరికాలో తెలుగు హీరోయిన్లతో మోదుగుమూడి కిషన్ దంపతుల సెక్స్ రాకెట్ పై స్పందించింది. చిత్ర పరిశ్రమలో అవకాశాలు లభించని ఆర్టిస్టులు నృత్య ప్రదర్శనలు, వివిధ షోల పేరిట అమెరికాకు వెళుతుంటారని చెప్పింది. అక్కడ వారితో వ్యభిచారం చేయిస్తుంటారని, ఒక్కో హీరోయిన్ కు ఉండే పాప్యులారిటీని బట్టి డబ్బులు అందుతుంటాయని వెల్లడించింది. కాసేపు గడిపినందుకు వీరికి 1000 డాలర్లకు పైగానే ముడుతుందని చెప్పింది. కిషన్ దంపతులు తనను కూడా అమెరికాకు రావాలని సంప్రదించారని, కానీ తాను వెళ్లలేదని చెప్పింది.
Casting Couch
Sri Reddy
Tollywood
S*x Rocket

More Telugu News