Nimmakayala Chinarajappa: రాంమాధవ్‌ను వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కలవడమే అందుకు నిదర్శనం: చినరాజప్ప

  • బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయి
  • నాలుగేళ్లుగా చంద్రబాబు కష్టపడుతున్నారు
  • రాష్ట్రం అభివృద్ధి జరగకూడదనే జగన్‌ ఆరోపణలు
తాము ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి చినరాజప్ప అన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధి కోసం నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతున్నారని, మరోవైపు వైసీపీ అధినేత జగన్‌.. ఏపీ అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశంతోనే తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

15 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్‌... చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదమని చినరాజప్ప వ్యాఖ్యానించారు. వైసీపీ ఎంపీల రాజీనామా అంతా నాటకమని, బీజేపీ, వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని, బీజేపీ నేత రాంమాధవ్‌ను వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కలవడమే అందుకు నిదర్శనమని అన్నారు.
Nimmakayala Chinarajappa
Andhra Pradesh
Jagan

More Telugu News