పవన్ కల్యాణ్ నివాసంలో రంజాన్ వేడుకలు

16-06-2018 Sat 15:14
  • హైదరాబాద్ లోని నా నివాసంలో పండగ జరుపుకున్నా
  • నాపై ప్రేమ చూపించే ప్రతిఒక్కరికి, సన్నిహితులకు శుభాకాంక్షలు
  • ముస్లిం సోదరులతో కలిసి దిగిన  ఫొటోను పోస్ట్ చేసిన పవన్

రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ట్వీట్ లో తన సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో రంజాన్ పండగ జరుపుకున్నానని, తనపై ప్రేమ చూపించే ప్రతిఒక్కరికి, సన్నిహితులకు ఈ పవిత్రమైన రోజున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి తాను ఉన్న ఓ ఫొటోను పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.