Uttam Kumar Reddy: ఢిల్లీలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక చర్చలు

  • మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉత్తమ్‌
  • తమ పార్టీ నాయకుల తీరుపై చర్చలు?
  • పలు సూచనలు తీసుకుంటోన్న టీపీసీసీ అధ్యక్షుడు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే, ఆయన మూడు రోజులుగా అక్కడే ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో తమ పార్టీ నాయకుల తీరుపై ఆయన కాంగ్రెస్‌ పెద్దలతో చర్చిస్తున్నట్టు సమాచారం. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన అర్ధ గంటపాటు చర్చించారు. ఈ సందర్భంగా ఆయనకు రాహుల్‌ పలు సూచనలు చేశారు.

తెలంగాణలో పార్టీ బలోపేతానికి పలు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ఈరోజు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మరి కొందరు నేతలతో చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ అశోక్ గెహ్లాట్‌తో తెలంగాణలో కమిటీల కూర్పుపై చర్చించనున్నారు. రాష్ట్రానికి ముగ్గురు ఇన్‌చార్జ్ సెక్రటరీలు, మరో ఇన్‌చార్జ్ జాయింట్ సెక్రటరీని కాంగ్రెస్‌ అధిష్ఠానం నియమిస్తుంది.        
Uttam Kumar Reddy
Congress

More Telugu News