charan: సంక్రాంతి బరిలోకి చరణ్ దిగడం ఖరారైపోయింది

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్
  • యాక్షన్ సీన్స్ కోసమే 5 కోట్ల ఖర్చు 
  • వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు  

చరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. చరణ్ జోడీగా కైరా అద్వాని కనిపించనుంది. ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తుందా? .. సంక్రాంతికి విడుదలవుతుందా? అనే సందేహం అభిమానుల్లో ఉండేది.ఈ నేపథ్యంలో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ వారు అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతుండగా, కీలకమైన యాక్షన్ సన్నివేశాల కోసమే 5 కోట్ల వరకూ ఖర్చు చేస్తున్నారని వినికిడి. ఈ యాక్షన్ సీన్స్ లో వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారట. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.   

More Telugu News