Hyderabad: కవలల గొంతు నులిమి వారి మేనమామే హతమార్చాడు: ఏసీపీ పృథ్వీధర్

  • చిన్నారులను హతమార్చిన ఘటనపై ఏసీపీ స్పందన
  • దిండుతో ఊపిరాడకుండా చేశాడు
  • నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశాం
మానసికంగా ఎదగని కవల పిల్లలను వారి మేనమామే హతమార్చిన సంఘటనపై కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తల్లిదండ్రులకు తెలిసే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ పృథ్వీధర్ మాట్లాడుతూ, చిన్నారుల గొంతు నులిమి, దిండుతో ఊపిరాడకుండా చేసి వారి మేనమామ మల్లికార్జునరెడ్డి హత్య చేశాడని తెలిపారు. నిందితుడిపై హత్యా నేరం నమోదు చేసినట్టు చెప్పారు. కాగా, తమ పిల్లలు హత్యకు గురైన సమాచారంతో చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు వారి తల్లిదండ్రులు వెళ్లారు. నిందితుడు మల్లికార్జునరెడ్డిపై ఫిర్యాదు చేయబోమని తల్లిదండ్రులు అంటున్నట్టు సమాచారం. హైదరాబాద్ చైతన్యపురిలోని సత్యనారాయణపురం కాలనీలో హత్య సంఘటన జరిగింది. 
Hyderabad
crime news

More Telugu News