Supreme Court: జీవితఖైదుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన 93 ఏళ్ల వృద్ధుడు!

  • నాలుగు దశాబ్దాల నాటి కేసులో జీవిత ఖైదు
  • పొలం విషయంలో ఘర్షణ.. ఒకరి మృతి
  • వాస్తవాలను హైకోర్టు విస్మరించిందంటూ సుప్రీంకోర్టుకు

నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన హత్య కేసులో హైకోర్టు జీవిత ఖైదు విధించడంపై 93 ఏళ్ల వృద్ధుడు సుప్రీంకోర్టును ఆశ్రయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సెప్టెంబరు 28, 1978లో ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌లో పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. రోహ్‌తాస్, అతడి అనుచరులు జరిపిన దాడిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ వీరిలో ఒకరు మృతి చెందాడు.

ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు రోహ్‌తాస్‌తోపాటు మరో ఇద్దరికి 1983లో జీవిత ఖైదు విధించింది. దీనిపై రోహ్‌తాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తాను అమాయకుడినని, తనపై పోలీసులు తప్పుడు అభియోగాలు నమోదు చేశారని ఆరోపించాడు. అయితే ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో రోహ్‌తాస్‌ ఈసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు పలు వాస్తవాలను విస్మరించిందని తన తాజా పిటిషన్‌లో పేర్కొన్నాడు.

More Telugu News