Andhra Pradesh: కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన గర్భిణిపై ఆర్‌ఎంపీ డాక్టరు అత్యాచారం

  • చిలకలూరిపేటలో ఘటన
  • భర్తను మందుల కోసం బయటకు పంపి అత్యాచారం
  • పోలీసుల అదుపులో నిందితుడు
కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఏడునెలల గర్భిణిపై ఓ ఆర్ఎంపీ డాక్టరు అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిందీ ఘటన. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే మహిళకు గురువారం అర్ధరాత్రి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. భర్త సాయంతో సమీపంలోనే ఉన్న క్లినిక్‌కు వెళ్లింది. ఆమెను పరీక్షించిన ఆర్ఎంపీ మందుల కోసం భర్తను దుకాణానికి పంపించాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Andhra Pradesh
Guntur
Chilakalooripet
RMP

More Telugu News