Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. చిన్నారులను దారుణంగా చంపేసిన మేనమామ!

  • హత్యకు గురైన చిన్నారులిద్దరూ మానసిక వికలాంగులే
  • స్వయంగా మేనమామే హత్య చేసిన వైనం
  • మృతదేహాలను తరలిస్తుండగా పట్టుబడిన నిందితుడు
హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులు దారుణ హత్యకు గురైన వార్తతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మృతదేహాలను నిందితుడు కారులో తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చైతన్యపురిలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన లక్ష్మి, శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు 12 ఏళ్ల వయసున్న సృజనరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి అనే కవలలున్నారు. వీరిద్దరూ మానసిక వికలాంగులు కావడంతో వారిని ఎలాగైనా వదిలించుకోవాలని వారి మేనమామ మల్లికార్జునరెడ్డి ప్లాన్ వేశాడు. చిన్నారులకు మాయమాటలు చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి హత్య చేశాడు. వారి మృతదేహాలను కారులో తరలించేందుకు బయటకు తీసుకురాగా ఇంటి యజమాని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది. మల్లికార్జునరెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం వెనక ఇంకెవరి హస్తం ఉందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
miryalaguda
Nalgonda
murder

More Telugu News