kalyani priyadarshan: మెగా హీరో జోడీగా కల్యాణి ప్రియదర్శన్

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో కల్యాణి ప్రియదర్శన్ 
  • ఆ తరువాత సినిమా కిషోర్ తిరుమలతో 
  • హీరోగా సాయిధరమ్ తేజ్  
'హలో' సినిమాతో తెలుగు తెరకి కల్యాణి ప్రియదర్శన్ పరిచయమైంది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో కల్యాణి ప్రియదర్శన్ ను ఒక్కసారిగా అవకాశాలు పలకరించలేదు. అయితే నటన పరంగా .. గ్లామర్ పరంగా యూత్ ను ఆకట్టుకోవడంతో, శర్వానంద్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగు దశలో వుంది.

ఈ సినిమా తరువాత కల్యాణి ప్రియదర్శన్ .. సాయిధరమ్ తేజ్ జోడీగా మరో ప్రాజెక్టును అంగీకరించిందనేది తాజా సమాచారం. సాయిధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల ఒక సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగును ఆరంభిస్తారు. కల్యాణి ప్రియదర్శన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు హిట్ అయితే, మరిన్ని అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తాయని చెప్పచ్చు.         
kalyani priyadarshan
sai dharam tej

More Telugu News