sensex: అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం.. ఒడుదొడుకుల మధ్య ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • ఒకానొక సమయంలో 120 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్
  • చివరకు 22 పాయింట్ల లాభంతో ముగింపు
  • 6.50 శాతం లాభపడ్డ అపోలో హాస్పిటల్స్

భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య మరోసారి వాణిజ్య యుద్ధం తలెత్తబోతోందనే అంచనాలతో మార్కెట్లు ఆసాంతం ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఒకకానొక సమయంలో సెన్సెక్స్ 120 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకుంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ బైబ్యాక్ ను ప్రకటించడంతో మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 22 పాయింట్ల లాభంతో 35,622 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 10,818 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (7.66%), స్ట్రైడ్స్ షాసూన్ లిమిటెడ్ (6.50%), అపోలో హాస్పిటల్స్ (6.01%), మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్ (5.19%), నవ భారత్ వెంచర్స్ (5.08%).

టాప్ లూజర్స్:
కార్పొరేషన్ బ్యాంక్ (-6.22%), వక్రాంగీ లిమిటెడ్ (-4.96%), రెయిన్ ఇండస్ట్రీస్ (-4.93%), ఐఎఫ్సీఐ లిమిటెడ్ (-4.56%), అలహాబాద్ బ్యాంక్ (-4.31%).     

More Telugu News