rajtarun: 'లవర్' టైటిల్ లోగో రిలీజ్ .. ఈ మూవీపైనే రాజ్ తరుణ్ ఆశలు

  • రాజ్ తరుణ్ హీరోగా 'లవర్'
  • కథానాయికగా రిద్ధి కుమార్ 
  • రేపు ఉదయం ఫస్టులుక్ రిలీజ్   

రాజ్ తరుణ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'లవర్' ముస్తాబవుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. యూత్ కి నచ్చే ప్రేమకథాంశంతో నిర్మితమైన ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి 'రిద్ధి కుమార్' కథానాయికగా పరిచయమవుతోంది. తాజాగా టైటిల్ లోగోతో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఒక అబ్బాయి చేయి .. అమ్మాయి చేయిని పట్టుకున్న పోస్టర్ ఇది. హాస్పిటల్ నేపథ్యంలో హీరో హీరోయిన్లకి సంబంధించిన ఈ స్టిల్ ఆసక్తిని రేకెత్తించేదిలానే వుంది. ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. వరుస పరాజయాలతో డీలాపడిన రాజ్ తరుణ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

More Telugu News