rupee: 68కి పతనమైన రూపాయి... మరికాస్త పతనం తప్పదు!

  • ఇంట్రాడేలో 38 పైసలు తగ్గి రూ.68.02 స్థాయికి చేరిక
  • బలపడిన డాలర్ ఇండెక్స్
  • రానున్న రోజుల్లో ఇంకా తగ్గొచ్చని విశ్లేషకుల అంచనా

రూపాయి విలువ డాలర్ తో ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో 38 పైసలు కోల్పోయి ఇంట్రాడేలో 68.02కి పడిపోయింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు బాండ్ల కొనుగోలుకు ఈ ఏడాది డిసెంబర్ తో ముగింపు పలకనున్నట్టు స్పష్టం చేసింది. వడ్డీ రేట్ల విషయంలో మాత్రం 2019 మధ్య కాలం వరకు వేచి చూడనున్నట్టు పేర్కొంది.

కానీ, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతోపాటు ఈ ఏడాది మరో రెండు పెంపులు ఉంటాయని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో యూరో కరెన్సీ విలువ డాలర్ తో పోలిస్తే పడిపోయింది. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ బలపడింది. ఈ క్రమంలో మన రూపాయి కూడా పతనాన్ని చవి చూసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 68.02 కనిష్ట స్థాయిలో ట్రేడ్ అయింది. కరెంటు అకౌంట్ ఖాతా లోటు పెరగడం, ద్రవ్యోల్బణం సైతం పెరగడం, దేశీయ కరెన్సీకి శుభసూచకం కాదని, మరికాస్త బలహీనత ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

More Telugu News