one plus 6: 22 రోజుల్లో 10 లక్షల ఫోన్ల విక్రయాలు... దూసుకుపోతున్న వన్ ప్లస్ 6

  • ఛైనాలో దీనికి అత్యధిక స్పందన
  • చాలా వేగంగా అమ్ముడవుతున్న ఫోన్ గా రికార్డు
  • గత నెలలోనే విడుదలైన ఫోన్

వన్ ప్లస్ 6 ఫోన్ కు చైనాలో తెగ స్పందన వస్తోంది. ఈ ఫోన్ గత నెలలో విడుదల కాగా, కేవలం 22 రోజుల్లోనే 10 లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి. మన దేశంలోనూ ఈ ఫోన్ విడుదలై అమ్మకాలు జరుపుకుంటోంది. చైనాకు చెందిన వన్ ప్లస్ బ్రాండ్ ప్రీమియం విభాగంలో ఫోన్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే.

తమ అంచనాలను వన్ ప్లస్ 6 అధిగమించిందని, అత్యద్భుత స్పందనకు ధన్యవాదాలని కంపెనీ సీఈవో పెటే లూ పేర్కొన్నారు. అత్యంత వేగంగా అమ్ముడుపోయే ఫోన్ ఇదే కావడం గమనార్హం. వన్ ప్లస్ 6 కంటే ముందు వన్ ప్లస్ 5, 5టీ మోడల్ ఫోన్లు 10 లక్షలు అమ్ముడుపోవడానికి మూడు నెలల సమయం పట్టగా, వన్ ప్లస్ 6కు 22 రోజులు సరిపోయింది. వన్ ప్లస్ 6 మన దేశంలో రూ.34,999 ధరకు అమ్ముడవుతోంది. ఇది 6జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర. 8జీబీ ర్యామ్, 128 జీబీ వెర్షన్ స్టోరేజీ ధర రూ.39,999.

  • Loading...

More Telugu News