fitbit band: చిన్నారుల చేతికి పెడితే... ఆరోగ్యం గురించి చెప్పే ఫిట్ బిట్ బ్యాండ్

  • గతంలో అమెరికాలో విడుదల
  • ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి 
  • ధర రూ.6,500

చిన్నారుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందే తల్లిదండ్రులకు కాస్త ఉపశమనం కల్పించే ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చింది. చిన్నారుల చేతికి వాచీ మాదిరిగే ధరించే బ్యాండ్ ను ఫిట్ బిట్ కంపెనీ ఫిట్ బిట్ ఏస్ పేరుతో గతంలో అమెరికాలో లాంచ్ చేయగా, ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చినట్టు కంపెనీ ప్రకటించింది. 8 సంవత్సరాలు, ఆపై వయసున్న చిన్నారుల కోసం ఉద్దేశించినది.

 ప్రతి గంటకోసారి వారికి రిమైండర్లను పంపుతూ వారి యాక్టివిటీని ట్రాక్ చేస్తుంది. ఇందులో చిన్నారులకు పోటీలు కూడా ఉంటాయి. చిన్నారుల చేతికి పెట్టి, మొబైల్ ఫోన్లో ఫిట్ బిట్ యాప్ కు కనెక్ట్ చేసుకోవాలి. పిల్లల నిద్ర తీరును రికార్డ్ చేసి తగినంత నిద్ర పోతున్నారా, లేదా? అన్నది చెబుతుంది. ఎన్ని కేలరీల ఆహారం తీసుకున్నారు, బరువు, బాడీ ఫ్యాట్, బీఎంఐ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. దీని ధర 99.95 డాలర్లు. మన కరెన్సీలో రూ.6,500.

  • Loading...

More Telugu News