nani: క్రికెటర్ గా కనిపించనున్న నాని!

  • నాని 23వ సినిమాగా 'జెర్సీ'
  • దర్శకుడిగా గౌతమ్  
  • క్రికెట్ నేపథ్యంలో సాగే కథ   

ప్రస్తుతం నాని .. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత నాని మరో కొత్త ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టును గురించి అధికారిక ప్రకటనగా ఒక స్పెషల్ పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ ను బట్టి ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ అనీ .. నాని ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి 'జెర్సీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకి గౌతమ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలియనున్నాయి. సంఖ్యా పరంగా చూసుకుంటే నానికి ఇది 23వ సినిమా .. చూస్తుండగానే నాని 25వ మైలురాయికి దగ్గరగా వచ్చేశాడు కదూ.

More Telugu News