swamy naidu: చిరంజీవి యువతకు నరసింహన్‌ చేతుల మీదుగా అవార్డు!

  • అందుకున్న చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు
  • రాజ్‌భవన్ లో కార్యక్రమం
  • అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన స్వామినాయుడు
చిరంజీవి యువత వేలాది రక్తదాన శిబిరాలు నిర్వహించి లక్షలాది రక్తదాతలతో రక్తదానం చేయిస్తోన్న విషయం తెలిసిందే. ఆ రక్తనిధులన్నింటిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటివారికి అందిస్తోంది. అలా రెడ్ క్రాస్ సంస్థకు రక్తనిధులందించిన వారిలో 'అఖిల భారత చిరంజీవి యువత' ప్రథమస్థానంలో నిలిచింది.

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడుకి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ ఈ సందర్భంగా ఓ అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ లో ఈ అవార్డు అందుకున్న తరువాత స్వామినాయుడు మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడానికి కారకులైన తెలుగు రాష్ట్రాలలో ఉన్న మెగా అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు
తెలియజేస్తున్నామని అన్నారు. 
swamy naidu
Chiranjeevi
blood bank

More Telugu News