bolly wood: సంజయ్ దత్ కు సంబంధించిన ఓ విషయం నమ్మలేం కానీ, వాస్తవం : దర్శకుడు హిరాణీ

  • సంజు ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది
  • సంజు  లైఫ్ లో కొన్ని సంఘటనలు నమ్మలేని విధంగా ఉంటాయి
  • ఓ కథ నమ్మశక్యంగా ఉండదు కానీ, వాస్తవం

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘సంజు’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను రణ్ బీర్ కపూర్ పోషిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘సంజు’ ట్రైలర్  ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ను దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి విడుదల చేశారు.

‘సంజు ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. సంజు జీవితంలో కొన్ని సంఘటనలు నమ్మలేని విధంగా ఉంటాయి. ఈ పోస్ట్ కార్డ్స్ చూడండి.. ప్రతి ఇమేజ్ ఒక కథే. ఓ కథ నమ్మశక్యంగా ఉండదు కానీ, అది వాస్తవం..’ అని తన ట్వీట్ లో చెప్పారు.

తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ పై ‘అమెరికాలోని రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి పారిపోయిన సంజు .. తన మిత్రుల వద్దకు వెళ్లడానికి బస్సు టిక్కెట్ కొనేందుకని అక్కడి వీధుల్లో బిచ్చమెత్తుతున్నాడు’ అని రాసి ఉంది. మరో పోస్టర్ పై.. ‘సంజు తొలి చిత్రం రాకీ ప్రీమియర్ షోకు మూడు రోజుల ముందు తన తల్లి నర్గీస్ దత్ ను కోల్పోయాడు’ అని రాసి ఉంది.

కాగా, ఈ నెల 29న ‘సంజు’ విడుదల కానుంది. సంజయ్ దత్ తల్లిదండ్రుల పాత్రల్లో పరేశ్ రావెల్, మనీషా కొయిరాలా నటించారు. ఇంకా ఈ చిత్రంలో సోనమ్ కపూర్, దియా మీర్జా, అనుష్క శర్మ నటించారు. 

More Telugu News