Palani swamy: పళని సర్కారు ఉంటుందా? ఊడుతుందా?.. హైకోర్టు తీర్పు నేడే!

  • 18 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నేడు హైకోర్టు తీర్పు
  • ఎమ్మెల్యేలు గెలిస్తే ఊడనున్న సర్కారు
  • ప్రభుత్వం గెలిస్తే ఉప ఎన్నికలు
  • తీర్పు కోసం దేశం మొత్తం ఉత్కంఠ

18 మంది రెబల్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాసు హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. తీర్పును రిజర్వు చేసిన ఐదు నెలల తర్వాత నేడు తుది తీర్పు వెల్లడి కానుండడంతో తమిళ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చీఫ్  జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం.సుందర్ తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

ఎమ్మెల్యేలు కనుక కేసును ఓడిపోతే ప్రభుత్వం నిలబడుతుంది. ఆ వెంటనే 18 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయి. ఒకవేళ ఎమ్మెల్యేలు ఈ కేసులో విజయం సాధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే కుప్పకూలుతుంది.  234 మంది సభ్యులున్న శాసనసభలో స్పీకర్ తప్ప అందరూ ఓటేస్తే ప్రభుత్వానికి  117 మంది ఓట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం అధికార పార్టీకి ఉన్నవి 113 ఓట్లు మాత్రమే. దీంతో ఇప్పుడు దేశం దృష్టి అటువైపు మళ్లింది. అయితే, తమకు ‘అమ్మ’ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని రెబల్ నేత తంగటమిల్ సెల్వన్ పేర్కొన్నారు.

గతేడాది సెస్టెంబరు 18న స్పీకర్ పి.ధన్‌పాల్ 18 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు పళని స్వామి సర్కారుపై తమకు విశ్వాసం లేదని  చెప్పారు. దీంతో వారిపై చీఫ్ విప్ ఎస్.రాజేంద్రన్ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అనర్హత వేటు వేశారు. దీంతో, ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు.

More Telugu News