Facebook: ఫేస్ బుక్ మోసం కేసులో మరో మలుపు... ఫొటోల్లో ఉన్నది ఎవరో చెప్పేసిన ఉపేంద్ర ప్రియురాలు!

  • ఫొటోల్లో ఉన్నది కాలేజీ స్నేహితుడే
  • గతంలో సన్నిహితంగా ఉండేవాళ్లం
  • విభేదాలు వచ్చి విడిపోయాం
  • మీడియాకు వెల్లడించిన సోనూ
మయూర్ పాన్ షాప్ పేరిట పలు రిటైల్ స్టోర్లు నిర్వహిస్తున్న ఉపేంద్ర వర్మపై నమోదైన ఫేస్ బుక్ మోసం కేసు మరో మలుపు తిరిగింది. బాధితురాలు సోనూకు పలువురితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఉపేంద్ర వర్మ సోదరుడు సురేంద్ర వర్మ పలు ఫొటోలను మీడియాకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆపై మరోమారు అడిషనల్ పోలీస్ కమీషనర్ షికా గోయల్ ను కలిసిన సోనూ, ఉపేంద్ర కుటుంబం వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.

తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినందునే ఉపేంద్రను నమ్మానని చెప్పారు. సురేంద్ర ఆరోపిస్తున్నట్టుగా, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని, ఆ ఫొటోల్లో ఉన్న యువకుడు తన కాలేజీ స్నేహితుడని, ఒకప్పుడు అతనితో చనువుగా ఉన్నానని, ఆపై విభేదాలు రావడంతో తాము విడిపోయామని తెలిపారు. దాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనను ఉపేంద్ర నమ్మించి మోసం చేశాడని సోనూ ఆరోపించింది.
Facebook
Upendra Varma
Sonu
Hyderabad
Police

More Telugu News