Bhyyuji Maharaj: భయ్యూజీ మహరాజ్ ఆత్మహత్య కేసులో మరో సూసైడ్ నోట్ లభ్యం

  • శిష్యుడు వినాయక్‌కు ఆశ్రమ బాధ్యతలు అప్పగించాలంటూ లేఖ
  • లేఖ వెనక ఎవరి ఒత్తిడీ లేదని స్పష్టీకరణ
  • మంగళవారం తుపాకితో కాల్చుకుని భయ్యూజీ ఆత్మహత్య
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహరాజ్ ఆత్మహత్య కేసులో మరో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సర్వోదయ్ ఆశ్రమాన్ని తన శిష్యుడు వినాయక్‌కు అప్పగిస్తున్నట్టు భయ్యూజీ పేర్కొన్నారు. వినాయక్ తనకు ఎంతో నమ్మకస్తుడని, ఆశ్రమ బాధ్యతలు, ఆస్తులు, ఆర్థిక పరమైన నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని అతడికి అప్పగిస్తున్నట్టు అందులో రాశారు. ఇలా రాయడం వెనక ఎవరి ఒత్తిడి తనపై లేదని స్పష్టం చేశారు.

ఆశ్రమ బాధ్యతలు మొత్తం వినాయక్ చూసుకునే వాడని, గురువుకు కుడి భుజంలా వ్యవహరించే వారని ఆయన సన్నిహితులు తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన వినాయక్ గత పదిహేనేళ్లుగా భయ్యూజీ శిష్యుడిగా ఉన్నారు. ఎంతో నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నారు. గురువు భయ్యూజీ వ్యక్తిగత విషయాలు కూడా వినాయక్‌కు తెలుసని చెబుతున్నారు.

భయ్యూజీ మహరాజ్ కుమార్తె బాధ్యతలను కూడా వినాయక్‌కే అప్పగించారు. మరోవైపు భయ్యూజీ మహరాజ్‌ను చివరిసారి దర్శించుకునేందుకు వచ్చిన వారితో ఇండోర్ కిక్కిరిసిపోయింది. తీవ్ర ఒత్తిడికి లోనైన భయ్యూజీ మహరాజ్ మంగళవారం మధ్యాహ్నం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్టు అందులో వివరించారు. తాజాగా రెండో సూసైడ్ నోట్ లభ్యమైంది.
Bhyyuji Maharaj
Madhya Pradesh
Indore
suicide

More Telugu News