ex additional sp sarathbabu: మొద్దు శీనుకు పోలీసు కావాలనే కోరిక ఉండేది!: మాజీ అడిషినల్ ఎస్పీ శరత్ బాబు

  • గుంటూరు జిల్లాలో నేను పని చేశాను
  • మొద్దు శీను కాలేజీలో చదువుకునే రోజుల్లో గ్రూపుగా తిరిగేవాడు
  • ఒకసారి గట్టిగా వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వదిలేశా
పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శీనుని జైలు గదిలోనే తోటి ఖైదీ సుమారు ఏడేళ్ల క్రితం హతమార్చిన విషయం తెలిసిందే. మొద్దు శీను గురించి మాజీ అడిషినల్ ఎస్పీ శరత్ బాబు ఆసక్తికర విషయం ఒకటి చెప్పారు. ఓ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో ఆయన పని చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.

గుంటూరు జిల్లాలో మొద్దు శీను కాలేజీలో చదువుకునే రోజుల్లో, అతనితో పాటు ఐదారుగురు గ్రూపుగా తిరిగేవారని, ఒకసారి గట్టిగా వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వదిలేశామని చెప్పారు. ఆ రోజుల్లో తుపాకులు పట్టుకుని తిరిగేంత రౌడీ అతను కాదని చెప్పిన శరత్ బాబ్, మొద్దు శీనుకు పోలీసు కావాలనే కోరిక ఉండేదని అన్నారు. పరిటాల రవి హత్య తర్వాత మొద్దు శీను ఈ స్థాయి రౌడీ అయ్యాడా? అని తాను ఆశ్చర్యపోయానని, అప్పటి వరకు అతను తనకు గుర్తే లేడని అన్నారు. మొద్దు శీను తెలంగాణ యాసను అనుకరించేవాడని నాటి విషయాలను శరత్ బాబు ప్రస్తావించారు.
ex additional sp sarathbabu
moddu srinu

More Telugu News