nandamuri: నాకు నేను హద్దులు గీసుకోదలచుకోలేదు: హీరో కల్యాణ్ రామ్

షార్ట్స్‌లో చూడండి
జయేంద్ర దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన ‘నా నువ్వే’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ, కమర్షియల్ హీరో అయిన కల్యాణ్ రామ్ రొమాంటిక్ సినిమాలు చేయటమేంటని అంటారేమో అని ఈ సినిమా చేసేటప్పుడు అనుకున్నానని చెప్పారు. 

‘నా నువ్వే’ తర్వాత ఇక రొమాంటిక్ హీరో అనే ముద్ర పడిపోతుందా? అని ప్రశ్నించగా.. అలాంటి పిలుపులు తనలో భయం పెంచుతాయని కల్యాణ్ రామ్ అన్నాడు. కానీ, ఫలానా చిత్రాల్లోనే నటించాలనే హద్దులు గీసుకోదలచుకోలేదని అన్నాడు. ‘పటాస్’ చిత్రం చేస్తున్న సమయంలోనే ఆ విషయం తనకు అర్థమైందని, అప్పటి వరకు హాస్యప్రధాన పాత్రను పోషించలేదని, తనకు తెలియకుండానే తనలోని కొత్త కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరించిందని చెప్పాడు. 
Go Back to Shorts
nandamuri
naa nuvee

More Telugu News