murali mohan: రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించారు?: జగన్‌పై మురళీ మోహన్‌ విమర్శలు

  • నేను తప్పు చేసినట్టు నిరూపించండి
  • రాజకీయాల నుంచి తప్పుకుంటాను
  • నిరూపించకలేకపోతే జగన్‌ కూడా తప్పుకుంటారా? 
  • జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఏపీనే అమ్మేస్తారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌ విమర్శలు చేశారు. నిన్న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బహిరంగ సభలో మాట్లాడిన జగన్‌.. టీడీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఎంపీ మురళీ మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌కు డబ్బు ఇచ్చి ఇసుక దోపిడీ చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

ఈ విషయంపై మురళీ మోహన్‌ స్పందిస్తూ.. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ఒకవేళ నిరూపించకలేకపోతే జగన్‌ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని సవాలు విసిరారు. తన తండ్రి వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్‌ లక్షల కోట్లు ఎలా సంపాదించారని ఆయన నిలదీశారు. ఒకవేళ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఏపీనే అమ్మేస్తారని అన్నారు.
murali mohan
Jagan
Telugudesam

More Telugu News