Deepika Padukone: నేను సురక్షితంగా ఉన్నాను: తమ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదంపై దీపికా పదుకుణే

  • ముంబయిలోని వర్లి ప్రాంతంలో అగ్ని ప్రమాదం
  • బహుళ అంతస్తుల భవనంలో దీపిక ఫ్లాట్‌
  • అభిమానుల ఆందోళన
  • అందరికీ థ్యాంక్యూ అంటూ హీరోయిన్ ట్వీట్‌

ముంబయిలోని వర్లి ప్రాంతంలో 45 అంతస్తుల భవనంలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ టవర్‌లోనే బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకుణే నివాసం ఉంటోంది. దీంతో ఆమె అభిమానులు ఆమె ఎలా ఉంది? ప్రమాదం సమయంలో అక్కడే ఉందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాదం గురించి స్పందించిన దీపిక తాజాగా ట్వీట్‌ చేసింది. 'నేను సురక్షితంగా ఉన్నాను. అందరికీ కృతజ్ఞతలు.. ప్రాణాలు పణంగా పెట్టి మంటలను అదుపు చేస్తోన్న అగ్నిమాపక సిబ్బంది కోసం ప్రార్థన చేద్దాం' అని పేర్కొంది. కాగా, ఆ ప్రాంతంలో 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు, రెండు అంబులెన్సులు కూడా చేరుకున్నాయి.              

More Telugu News