bjp: దక్షిణాదిలో పాగా వేయాలనేది బీజేపీ ఆశయం: ఎమ్మెల్సీ మాధవ్

  • సౌత్ ప్రణాళిక ఏడాదిన్నర క్రితమే సిద్ధమైంది
  • మా ఆపరేషన్ కర్ణాటక నుంచి ప్రారంభించాం
  • ఏపీలో త్వరలోనే కేంద్రమంత్రుల బృందం పర్యటించనుంది
దక్షిణాదిలో పాగా వేయాలనేది బీజేపీ ఆశయమని, ఈ నేపథ్యంలో బీజేపీ ఆపరేషన్ లో భాగంగా సౌత్ ప్రణాళిక ఏడాదిన్నర క్రితమే సిద్ధమైందని ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ ఆపరేషన్ కర్ణాటక నుంచి ప్రారంభించామని, మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడుతుందని అన్నారు. త్వరలోనే ఏపీలో కేంద్రమంత్రుల బృందం పర్యటించనుందని, ఏపీకి కేంద్రం చేసిన సాయంపై ప్రజలకు వివరిస్తామని, బీజేపీ అగ్రనాయకులు ప్రతి జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తారని, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో అమిత్ షా పర్యటించనున్నారని చెప్పారు.
bjp
madhav

More Telugu News