stock market: ఒత్తిడికి గురైన సూచీలు.. స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న మార్కెట్లు!

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 47 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
  • 5.30 శాతం నష్టపోయిన ఐడియా సెల్యులార్

భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఈ ఉదయం మార్కెట్లు ఉత్సాహంగానే ప్రారంభమైనప్పటికీ... ఆ తర్వాత ఒత్తిడికి గురయ్యాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపడంతో... స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 47 పాయింట్ల లాభంతో 35,739కి చేరుకుంది. నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 10,857 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డెల్టా కార్ప్ లిమిటెడ్ (7.52%), రెడింగ్టన్ ఇండియా లిమిటెడ్ (7.48%), పీసీ జువెలర్స్ (7.15%), పరాగ్ మిల్క్ ఫుడ్స్ (6.80%), కావేరీ సీడ్ కంపెనీ (6.11%).

టాప్ లూజర్స్:
ఐడియా సెల్యులార్ లిమిటెడ్ (-5.30%), అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ (-4.40%), ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (-4.28%), ఎంఎంటీసీ లిమిటెడ్ (-3.92%), ఎన్సీసీ (-3.68%).          

More Telugu News