Kadapa District: కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసిన కేంద్ర సర్కారు

  • రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి
  • అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నివేదిక  
  • ఆ ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాలు సాధ్యం కావు
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాతో పాటు తెలంగాణలోని బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్ల ఏర్పాటు ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆయా ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సూచనలు ఉన్నాయని సుప్రీంకోర్టుకు చెబుతూ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

తాము అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్పష్టమైన నివేదిక ఇచ్చామని, ఆ ప్రాంతాల్లో ఉక్కు కర్మాగారాలు సాధ్యం కావని చెప్పామని తెలిపింది. ఇప్పటికే ఉన్న ఉక్కు పరిశ్రమలు నష్టాల్లో ఉన్నాయని చెప్పుకొచ్చింది. గతంలోనే ఈ విషయంపై తాము స్పష్టమైన ప్రకటన చేశామని పేర్కొంది.      
Kadapa District
Telangana

More Telugu News