race3 movie: సల్మాన్ రేస్ 3ని భార్యతో కలసి వీక్షించిన ధోని... ప్రముఖుల హాజరు

  • సన్నిహితులకు ముంబైలో సినిమా ముందస్తు ప్రదర్శన
  • పాల్గొన్న చిత్ర నటీనటులు, సల్మాన్ సోదరుడి కుటుంబం
  • ఈ నెల 15న విడుదల కానున్న సినిమా
సల్మాన్ ఖాన్ నటించిన రేస్3 సినిమా ఈ నెల 15న విడుదల కానుండగా, దీని కంటే ముందుగానే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు ఈ సినిమా ప్రదర్శన చూపించారు. ముంబైలో మంగళవారం నిర్వహించిన ఈ సినిమా ప్రదర్శనకు క్రికెటర్ ధోని, తన భార్య సాక్షితో కలసి పాల్గొన్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెస్, బాబీడియోల్, అనిల్ కపూర్, దైసీషా, సాఖిబ్ సలీమ్ తోపాటు సల్మాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ తన భార్య సీమా, కుమారుడితో కలసి విచ్చేశారు. సల్మాన్ సోదరుడి కుటుంబం మినహా మిగిలిన వారందరూ ఈ చిత్రంలో నటించిన వారే. రెమో డిసౌజా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
race3 movie
salman khan

More Telugu News