Iran: ఇరాన్ చేసిన ఘోర అవమానం... తలకు చున్నీ లేదని ఆసియన్ చెస్ టోర్నీ నుంచి సౌమ్యను గెంటేసింది!

  • తలకు చున్నీతో తన వ్యక్తిగత హక్కులకు భంగమన్న సౌమ్య
  • టోర్నీలో పాల్గొనేందుకు అనుమతించేది లేదన్న అధికారులు
  • ఇంకా స్పందించని ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్

ఉమెన్ గ్రాండ్ మాస్టర్, మాజీ వరల్డ్ జూనియర్ గార్ల్స్ చాంపియన్ సౌమ్యా స్వామినాథన్ కు ఇరాన్ లో ఘోర అవమానం ఎదురైంది. ఇక్కడి హమదాన్ లో ప్రారంభమైన ఆసియన్ టీమ్ చెస్ చాంపియన్ షిప్ నుంచి ఆమెను బలవంతంగా గెంటేశారు. ఈ టోర్నీలో పాల్గొనే మహిళలంతా విధిగా హెడ్ స్కార్ఫ్ (తల చుట్టూ చున్నీ) ధరించాలని ఇరాన్ నిబంధన విధించగా, అది తన వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లినట్టని సౌమ్య వాదించడమే ఇందుకు కారణం.

"నా తలకు చున్నీ కప్పుకోవడం లేదా బురఖాను బలవంతంగా ధరించడం నాకు ఇష్టం లేదు. ఇరాన్ చట్టంలోని ఈ నిబంధన నా కనీస మానవ హక్కులకు భంగం కలిగించేలా ఉంది. నా వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉంది. స్కార్ఫ్ ధరించకుంటే టోర్నీలో అనుమతించబోమని వారు స్పష్టం చేశారు" అని 29 ఏళ్ల వరల్డ్ నంబర్ 5 చెస్ క్రీడాకారిణి సౌమ్య పేర్కొంది. ఇరాన్ అధికారుల నిర్ణయం తనకెంతో బాధను కలిగించిందని చెప్పింది. కాగా, 2016లో సైతం ఇదే కారణంతో ఇండియన్ షూటర్ హీనా సింధూ సైతం షూటింగ్ పోటీల నుంచి వైదొలగిందన్న సంగతి తెలిసిందే. కాగా, సౌమ్యకు ఎదురైన అవమానంపై ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఇంకా స్పందించలేదు.

More Telugu News