Sharook Khan: నటిని ముద్దాడేందుకు షారూక్, గుల్షన్ గ్రోవర్ పోటీ పడుతున్న పాత ఫొటో వైరల్... ఆమె ఎవరా అని తెగ ఆరా తీస్తున్న నెటిజన్లు!

  • రెండు రోజుల నుంచి చక్కర్లు కొడుతున్న ఫొటో
  • 1995లో వచ్చిన 'బాజీ' సినిమాలోనిది
  • నటి వేషంలో ఉన్నది అమీర్ ఖాన్

నెట్టింట ఇప్పుడు తెగ వైరల్ అవుతున్న ఫొటో ఇది. పాత ఫొటోనే అయినా, దీనిలో షారూక్ ఖాన్, గుల్షన్ గ్రోవర్ లు ఓ నటిని ముద్దాడేందుకు ఒకేసారి పోటీ పడుతున్నారు. ఇక వీరిద్దరి మధ్యలో ఉన్నది ఎవరా అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ఫొటో వెనకున్న వాస్తవం ఏంటంటే...
ఇది 1995లో వచ్చిన 'బాజీ' చిత్రంలోనిది. చిత్రంలో ఉన్న నటి ఎవరో కాదు... అమీర్ ఖాన్. అశుతోష్ గోవారికర్ తీసిన ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో అమీర్ ఖాన్ ఇలా అమ్మాయి వేషం వేసుకున్నాడు. ఓ కేసు పరిష్కారం నిమిత్తం అండర్ కవర్ ఆపరేషన్ సాగించే అమీర్, ఇలా అమ్మాయి వేషం వేసుకున్నాడు. చిత్రంలో ఆ సమయంలో 'డోలే డోలే' అంటూ సాగే పాట కూడా వస్తుంది.

More Telugu News