surya: సమసిపోయిన విభేదాలు.. హీరో సూర్య, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ మళ్లీ ఒక్కటయ్యారు!

  • గతంలో విభేదాలు
  • అప్పటి నుంచి మాటల్లేవ్‌
  • సూర్య కోసం కథ సిద్ధం చేస్తున్నానన్న దర్శకుడు

తమిళ హీరో సూర్య, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ మళ్లీ కలిసిపోయారు. గతంలో ఓ సినిమా విషయంలో వీరద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఆ సినిమాను సదరు దర్శకుడు విక్రమ్‌తో తీశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటల్లేవ్‌.. అయితే, తాజాగా గౌతమ్‌ మీనన్‌ ఓ వీడియోలో సూర్య అభిమానులకు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పారు. తాను సూర్యతో ఓ సినిమా తీయడానికి ఫ్లాన్‌ చేస్తున్నానని అన్నారు.

ప్రస్తుతం ఆ సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నానని, వచ్చే ఏడాది ఈ సినిమా రూపొందుతుందని గౌతమ్‌ మీనన్‌ పేర్కొన్నారు. మరోవైపు, సూర్య కూడా గతంలో గౌతమ్‌ మీనన్‌కు సారీ చెబుతూ ఓ లేఖ కూడా రాశాడు. గతంలో సూర్య, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో కాఖా కాఖా, సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి.

More Telugu News