vajpayee: వాజ్‌పేయి ని చూడడానికి ఎయిమ్స్‌ కు చేరుకున్న మన్మోహన్‌ సింగ్‌

  • ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో వాజ్‌పేయికి చికిత్స
  • ఆయనకు ప్రముఖుల పరామర్శ  
  • వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని కాన్పూర్‌లో హోమం

భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఆయనను చూసి వివరాలు తెలుసుకోవడానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అక్కడకు చేరుకున్నారు. వాజ్‌పేయిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.

కాగా, అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా ఆసుపత్రికి వచ్చి వాజ్‌పేయిని చూసి వెళ్లారు. మరికొందరు ప్రముఖ నేతలు కూడా ఎయిమ్స్‌కు వచ్చారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, వాజ్‌పేయి త్వరగా కోలుకోవాలని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బీజేపీ కార్యకర్తలు హోమం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News