రిలయన్స్‌ జియో మరో ఆఫర్‌

  • ప్రతి ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై రోజూ 1.5 జీబీ అద‌న‌పు డేటా
  • ఈ రోజు సాయంత్రం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆఫర్‌..
  • రూ.399 ప్లాన్‌ రూ.100 డిస్కౌంట్ కూడా పొడిగింపు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. ప్రతి ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై రోజూ 1.5 జీబీ అద‌న‌పు డేటా అందిస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు సాయంత్రం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఈ అదనపు డేటా అందుకోవచ్చు. రూ.149, రూ.349, రూ.399, రూ.449, రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్ల‌కు అదనంగా రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున అదనంగా అందుకోవచ్చు.

అలాగే, రూ.509 ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 4 జీబీ డేటాకు బ‌దులుగా 5.5 జీబీ డేటా, రూ.799తో రీచార్జ్‌ చేసుకుంటే రోజుకు 5 జీబీ డేటాకు బ‌దులుగా 6.5 జీబీ డేటా వస్తుంది. అలాగే, రూ.399 ప్లాన్‌ను జియో యాప్‌లో ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకుంటే రూ.100 డిస్కౌంట్ లభించే ఆఫర్‌ను కూడా పొడిగించారు.  
Go Back to Shorts
Reliance
jio
prepaid

More Telugu News