kalva: ఈవీఎంల ట్యాంపరింగ్‌ను జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చుతాం: ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

  • బ్యాలెట్‌ పేపర్లతో ఓటింగ్‌ ప్రక్రియ జరగాలి
  • ఎవరికి ఓటు వేస్తున్నామో స్పష్టంగా చూసుకోవచ్చు
  • ట్యాంపరింగ్‌లపై మొదటి నుంచి అనేక అనుమానాలు 
  • ప్రజాస్వామ్యం బతకడానికి కృషి చేస్తాం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లి ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్‌ చేయొచ్చనే విషయాన్ని ఆధారాలతో పాటు నిరూపించారని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈరోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రజాస్వామ్య శక్తుల్ని బలహీన పరుస్తోందని అన్నారు.

మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని కాల్వ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రకరకాల అనుమానాలు దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మరోలా కుట్ర చేశారని, ఆ రాష్ట్రంలో ముస్లింల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపణలు వచ్చాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో తాము ఎవరికి ఓటు వేశామో స్పష్టంగా తెలుసుకునే విధంగా ఎన్నికలు ఉంటాయని అన్నారు.

బ్యాలెట్‌ పేపర్లతో ఓటింగ్‌ ప్రక్రియ జరిగితే తాము ఎవరికి ఓటు వేస్తున్నామో స్పష్టంగా చూసుకునే అవకాశం ఓటర్లకు ఉంటుందని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌లపై తాము మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చామని అన్నారు. బ్యాలెట్‌ పేపర్ల విధానం మంచిదని అంటున్నామని అన్నారు. అలాగే, ఈ విషయంపై మరింత ముందుకెళ్లి తప్పకుండా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చి తీరతామని చెప్పారు. ప్రజాస్వామ్యం బతకడానికి మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని ఎన్నికల్లో ఓట్ల రూపంలో సరిగ్గా ప్రతిబింబించేలా చేయడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News