raj tarun: మరోసారి రాజ్ తరుణ్ జోడీగా హెబ్బా పటేల్

  • తమిళంలో హిట్ కొట్టిన 'నానుమ్ రౌడీ దాన్'
  • విజయ్ సేతుపతి .. నయన్ క్రేజ్ పెంచిన మూవీ 
  • తెలుగులోకి రీమేక్ చేస్తోన్న సి.కల్యాణ్

రాజ్ తరుణ్ .. హెబ్బా పటేల్ జంట యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కుమారి 21F' .. 'ఈడోరకం ఆడోరకం' సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఆ తరువాత ఈ జోడీ కలిసి నటించిన 'అంధగాడు' మాత్రం నిరాశ పరిచింది. అయితే మరోమారు ఈ జంట కలిసి నటించనుందనేది తాజా సమాచారం.

కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన 'నానుమ్ రౌడీ దాన్' మూవీకి ఇది రీమేక్. విజయ్ సేతుపతి .. నయనతార జంటగా విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అలాంటి ఈ సినిమాను నిర్మాత సి.కల్యాణ్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ జోడీగా హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. కొంతకాలంగా ఇటు రాజ్ తరుణ్ .. అటు హెబ్బా పటేల్ ఇద్దరూ కూడా సక్సెస్ లు లేక డీలా పడ్డారు. ఈ ఇద్దరికీ ఈ సినిమా సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి.  

More Telugu News